- వారిని సిటీ నుంచి వెనక్కి పంపాలి
- భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి
పంజాగుట్ట, వెలుగు: సిటీలో అక్రమంగా స్థిరపడిన రోహింగ్యాలను గుర్తించి, వెనక్కి పంపడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమితి, ధర్మ రక్షణ సభ అధ్యక్షుడు జీ. రాఘవరెడ్డి మాట్లాడుతూ.. నగరంలో అన్ని రంగాలలో రోహింగ్యాలు స్థిరపడుతున్నారని, వారి వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రోహింగ్యాలు చేస్తున్న అరాచకాలూ పెరిగాయని, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోహింగ్యాలను తిరిగి పంపేందుకు ధర్మరక్షణ సభ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి ఉద్యమిస్తున్నామని, ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు, అన్ని మతాల ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో నాయకులు ఆర్. శశిధర్, కనూనిమల్, గోవిందరాజు, వైకుంఠం, శ్రీరామదాస్ పాల్గొన్నారు.
