ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతడు: భట్టి విక్రమార్క

ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతడు: భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు:  అడ్డగోలుగా అప్పులు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు డబ్బుల కోసం సర్కార్ భూములను అమ్ముతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వ భూములు అయిపోయాక, ప్రజల భూములను కూడా లాక్కొని కేసీఆర్ అమ్మకానికి పెడతాడని ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో భట్టి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని అడ్డుకున్న కేసీఆర్ ఇప్పుడు విక్రయించడమేంటని ప్రశ్నించారు. ప్రజా ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని, ప్రజలంతా దీని గురించి ఆలోచన చేయాలని కోరారు. 

వచ్చే అసెంబ్లీకి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి 15 మంది కూడా ఉండరని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడమని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రజలు అధికారం ఇస్తే, వాటిని అమ్ముకోవడానికి హక్కు ఇచ్చినట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఫైర్​ఆయ్యారు. సభలో తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సభ ఎజెండా ఏంటో చెప్పకుండా, అప్పటికప్పుడు టేబుల్ మీద ఎజెండా పెడితే ఎలా అని ప్రశ్నించారు.