జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి గతంలో ప్రైవేట్ పిటిషన్ వేశారు.
అయితే, ఆయన చనిపోవడంతో కేసు విచారణ కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో కోర్టు పంపిన నోటీసు లు కేసీఆర్‌కు అందలేదని తేలింది. దీంతో తాజాగా ఇచ్చిన నోటీసులు ఆయనకు పక్కా గా అందేలా చూడాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
