V6 News

Rohit Sharma Injury: రోహిత్ శర్మ గాయంపై బిగ్ అప్‌డేట్.. ముంబై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Rohit Sharma Injury: రోహిత్ శర్మ గాయంపై బిగ్ అప్‌డేట్.. ముంబై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Rohit Sharma Injury: ముంబై ఇండియన్స్ జట్టు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో టార్గెట్ ఛేదనలో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma Injury) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా మైదానం వీడాడు. దీంతో 241 రన్స్ ఛేదనలో ముంబై  కేవలం 222 పరుగులకే పరిమితమైంది. అప్పటికి రోహిత్ 13 బంతుల్లో 19 రన్స్ చేశాడు. ఈ క్రమంలో రోహిత్ గాయంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. కానీ, అతడికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ వచ్చింది. కండరాలు పట్టేయడంతో స్టేడియం వీడిన అతడు.. స్కానింగ్ తీయించుకున్నాడు. 

మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చీలిక లేదని తేలిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుతో గురువారం (026, ఏప్రిల్ 16న) మ్యాచ్లో ఆడతాడో? లేదో అనేది ఇంకా గందరగోళంగానే ఉంది. గాయం మరీ పెద్దది కాకపోవడంతో ఫస్ట్ అనుకున్నట్లు మరిన్ని మ్యాచులకు మాత్రం దూరమయ్యే ఛాన్స్ లేదు. ఇవాళ సాయంత్రానికి రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ALSO READ : ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్న ఫుట్‌బాల్ ప్లేయర్..

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న రోహిత్ సేవలు జట్టుకి ఎంతో అవసరం. కనీసం అతడిని ఇంపాక్ట్ ప్లేయర్ గానైనా బరిలోకి దింపే అవకాశం ఉంటుందని ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ తరపున 6వేల రన్స్ చేసిన బ్యాటర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ సీజన్లో ముంబై నాలుగు మ్యాచుల్లో ఒకేఒక్క విజయం సాధించింది. ప్లేఆఫ్స్ కి చేరుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపిస్తోన్న ఎంఐ.. బౌలింగ్ మాత్రం తేలిపోతోంది. స్టార్ పేసర్లు బుమ్రా, బౌల్ట్ ప్రభావం చూపింలేక, ఘోరంగా విఫలమవుతున్నారు.

ALSO READ : లక్నో vs ఆర్సీబీ మధ్య హై వోల్టేజ్ ఫైట్..