డబ్బులు డిపాజిట్ చేద్దామని బ్యాంకు వచ్చాడు. డిపాజిట్ ఫాం నింపి డబ్బును బ్యాంకు లో తన ఖాతాలో జమ చేసి వెళ్తామనుకున్నాడు. అప్పటివరకు ఆరోగ్యంగా, ఉత్సాహంగానే ఉన్నాడు. అయితే ఇంతలోనే గుండెపోటు రూపంలో మృత్యవు అతడిని వెంటాడింది. డిపాజిట్ ఫాం రాస్తూనే అసౌకర్యంగా ఫీలయిన ఒక్కసారిగా కుప్పకూలాడు. చూస్తుండగానే విగతజీవిగా మారాడు..వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని హబ్సిగూడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకులో డిపాజిట్ ఫాం నింపుతూ కస్టమర్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఉద్యోగులు, కస్టమర్లు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతుడు నాచారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ లో.. ఓ వ్యక్తి టేబుల్ పై కూర్చొని ఏదో రాస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతలోనే అతను అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. అతని వెనక కూర్చున్న మహిళ లేచి గదినుంచి బయటికి వెళ్లిన కొద్ది క్షణాల్లో ఆ వ్యక్తి సీటులోంచి నేలపడిపోయాడు. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వృద్ధుడు చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
A 72-year-old man died of a heart attack while filling out a deposit slip at the Punjab National Bank in Habsiguda on Wednesday, April 15.
— The Siasat Daily (@TheSiasatDaily) April 15, 2026
The man has been identified as Lakshminarayana, a retired employee residing in Nacharam. He had visited the bank to deposit money, but… pic.twitter.com/yrA5RD44NX

