హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న రన్నింగ్ బైకులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు బైకును పక్కనే పార్కింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. బైకు మంటల్లో పుర్తిగా కాలిపోయింది.
ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కావడంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఘటనలో కాసేపు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మంటలను ఆర్పివేసి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
