- 4 వేల బిజినెస్ టు బిజినెస్ మీటింగ్‌ల నిర్వహణ
- 120 స్టార్టప్‌ల రిజిస్ట్రేషన్.. టాప్ 5 స్టార్టప్‌లకు బయో ఏషియా అవార్డులు
- రెండేండ్లలోనే లైఫ్సైన్సెస్లో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి న బయో ఏషియా 2026 సదస్సు సూపర్ సక్సెస్ అయింది. లైఫ్‌సైన్సెస్, టెక్ బయో ఎకోసిస్టమ్‌లో ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ప్రాధాన్యం తదితర అంశాలపై ప్యానెల్ చర్చలను నిర్వహించారు. నిరుడు నిర్వహించిన సదస్సుతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది దేశ, విదేశాల కంపె నీల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
ఈసారి 4,500 మంది ప్రముఖులు సదస్సుకు వచ్చారు. ఇప్పటిదాకా నిర్వహించిన సదస్సులకు వచ్చిన వారితో పోలిస్తే.. ఇదే హయ్యెస్ట్ నంబర్ కావడం విశేషం. సదస్సులో భాగంగా 4 వేలకుపైగా బిజినెస్ టు బిజినెస్ మీటింగులు, డిస్కషన్లు జరిగాయి. తద్వారా కంపెనీల మధ్య కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందా లు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇక, ఈ ఏడా ది120 స్టార్టప్‌లను బయో ఏషియా సదస్సుకు ఎంపి క చేశారు. అందులో 40కిపైగా స్టార్టప్‌లు మెడ్‌టెక్, మెడికల్ పరికరాలు, బయో ఫార్మా, సెల్ అండ్ జీన్ థెరపీ, ఏఐ, న్యూట్రాస్యుటికల్స్, బయోమార్కర్స్ వంటి సెక్టార్లలో మంచి పరిష్కారాలు చూపించాయి. అందులో నుంచి ఐదు స్టార్టప్‌లను బయో ఏషియా 2026 అవార్డులకు ఎంపిక చేశారు. సదస్సు ముగిం పు వేడుకలకు హాజరైన మంత్రి శ్రీధర్ బాబు ఆయా సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డులు వరించిన స్టార్టప్‌లు ఇవే..
అచల హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్: ఆస్పత్రులకు వచ్చే రోగుల క్లినికల్ డాక్యుమెంటేషన్, డిశ్చార్జ్ సమ్మరీస్, క్లినికల్ సెర్చ్, క్లెయిమ్ కోడ్లపై ఏఐ ఆధారిత సర్వీసులను ఈ సంస్థ అందిస్తున్నది. ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య, రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. రోగులకు మెరుగైన సేవలను అందించేందుకు ఈ స్టార్టప్ దోహదం చేస్తున్నది. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ సంస్థ సేవలను అందించేందుకు వీలుంటుంది.
ఎక్స్క్వింజ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్: వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రతల వద్దే నిల్వ ఉంచాల్సి ఉంటుంది. వాటి షెల్ఫ్ లైఫ్ కూడా తక్కువ. ఒక్కోసారి వాటిని మనం మానిటర్ చేయడం కష్టమవుతుంటుంది. అలాంటి నష్టాలకు చెక్ పెట్టేలా ఈ సంస్థ ఏఐ ఆధారిత డిజిటల్ వ్యాక్సిన్ వయల్ మానిటర్ సర్వీసులను అందిస్తున్నది. ఏఐ ఆల్గారిథమ్స్ వ్యాక్సిన్ల షెల్ఫ్‌లైఫ్‌ను పసిగట్టి.. డేట్ దాటిపోయే ప్రమాదముంటే అలర్ట్ చేస్తుంది.
హెలెక్స్: కిడ్నీ జబ్బులకు నాన్ వైరల్ జీన్ థెరపీలను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. కిడ్నీల్లో లోపించే పీకేడీ1 అనే జన్యువును మళ్లీ రీస్టోర్ చేసే చికిత్సలను ఈ సంస్థ రూపొందించింది.
నేచురల్ సొల్యూషన్స్ అండ్ న్యూట్రాస్యూటికల్స్
ప్రైవేట్ లిమిటెడ్: హెర్బల్ ఆధారిత వైరులినా అనే ప్రొడక్ట్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే వైరస్‌లపై ఇది సమర్థంగా పని చేస్తున్నట్టు ప్రీక్లినికల్ స్టడీస్‌లో వెల్లడైంది. ఈ ప్రొడక్టుపై సంస్థకు పేటెంట్ కూడా లభించింది.
శ్రీగురవే లైఫ్‌సైన్సెస్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్: బయాప్సీ శస్త్రచికిత్సలకు బయోమ్యాప్ మార్కర్లను ఈ సంస్థ అభివృద్ధి చేస్తున్నది.
లైఫ్‌సైన్సెస్ పవర్‌హౌస్‌గా తెలంగాణ: శ్రీధర్ బాబు
తెలంగాణను గ్లోబల్ లైఫ్‌సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో రెండేళ్లలోనే రూ. 73,360 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, లక్ష ఉద్యోగాలను సృష్టించామన్నారు. బుధవారం హైటెక్స్ లో ‘బయో ఏషియా 2026’ సదస్సులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ 2047: బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టం’ పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుక లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతా నికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగ స్వామ్యంతో తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకా రం చుట్టామన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా లైఫ్ సైన్సెస్ రంగం ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, లైఫ్సైన్సెస్సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
