ఐడీహెచ్ కాలనీలో ఘనంగా మంత్రి తలసాని శ్రీనివాస్ బర్త్ డే

ఐడీహెచ్ కాలనీలో ఘనంగా మంత్రి తలసాని శ్రీనివాస్ బర్త్ డే

పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేట డివిజన్ ఐడీహెచ్ డబుల్ బెడ్రూం కాలనీలో గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ నేతలు, కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్​చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ కేక్​ను కట్ చేశారు. కార్యకర్తలకు, కాలనీవాసులకు స్వీట్లను పంచి పెట్టారు. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చిన తలసాని శ్రీనివాస్​కు స్థానిక ఐడీహెచ్​కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తలసాని శ్రీనివాస్​ను గెలిపిస్తామని.. ఇదే తాము ఆయనకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ అంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బన్సీలాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ వెంకటేశన్ రాజు, నాయకులు అంగముత్తు శ్రీనివాస్, మిట్టపెల్లి శ్రీనివాస్​, ఎం. సురేశ్, ఎన్. మల్లేశ్, జె. వినోద్,ఎం.మహేశ్, గజ్జెల శ్రీనివాస్, శివకుమార్, ఎల్. సురేశ్, నర్సింగ్​ రావు  పాల్గొన్నారు.