తిరుచానూరులో అమ్మవారి భక్తులపై అరాచకం..పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లు.. న్యాయవాదిపై దాడి.!

తిరుచానూరులో అమ్మవారి భక్తులపై అరాచకం..పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లు.. న్యాయవాదిపై దాడి.!

ఏపీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి సన్నిధిలో భక్తులపై కొందరు వ్యక్తులు జలగల్లా విరుచుకుపడుతున్నారు. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ ముందే ఓ న్యాయవాదిపై పార్కింగ్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేయడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చిన అడ్వకేట్‌ను పార్కింగ్ వసూళ్ల పేరుతో వేధించడమే కాకుండా.. కనికరం లేకుండా  దాడికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అరాచకానికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయని వారికి పంచాయతీ కార్యదర్శి పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అక్కడ పోలీసులు ఉన్నారు.. మీడియా ఉంది.. పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కానీ బాధితుడిని రక్షించాల్సింది పోయి అందరూ ఏదో సినిమా చూస్తున్నట్లు  చూడటం శోచనీయం.  నిత్యం భక్తులపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నా  తమకు సంబంధం లేదు అన్నట్లుగా  టీటీడీ  వ్యవహరించడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది.  ఈ ఘటనలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భక్తుల రక్షణలో వైఫల్యం చెందిన అధికారుల తీరుకు నిరసనగా.. ఏప్రిల్ 13న టీటీడీ పరిపాలనా భవనం దగ్గర  ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.