ట్రైనీ ఐపీఎస్కు పోలీసుల నోటీసులు.. సొంతూరు వెళ్లిన ఉదయ కృష్ణా రెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్

ట్రైనీ ఐపీఎస్కు పోలీసుల నోటీసులు.. సొంతూరు వెళ్లిన ఉదయ కృష్ణా రెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డికి పోలీసులు నోటీసులు  జారీ చేశారు. లైంగిక ఆరోపణలపై  8 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో  పేర్కొన్నారు పోలీసులు . ప్రస్తుతం నేషనల్ పోలీస్ అకాడమీ నుండి తన సొంత ఊరు ప్రకాశం జిల్లాకు వెళ్లిపోయిన ఉదయ్ కృష్ణ రెడ్డి.  ఈ కేసును జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ట్రైనీ ఐపీఎస్

లైంగిక ఆరోపణలు, పోలీసుల నోటీసుల క్రమంలో ఉదయ కృష్ణారెడ్డి సొంతూరుకు వెళ్లిపోయారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల పై స్పందించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి
తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవం అంటూ పోస్టు పెట్టారు.  చట్టం పై నాకు పూర్తి నమ్మకం ఉంది..  న్యాయం తప్పక గెలుస్తుంది అంటూ పోస్టు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 

వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే  రిపోర్ట్ చేయండి అంటూ పోస్ట్ పోస్ట్ చేశారు.  నిన్న (జులై 19) అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన  కేసు లో పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలో  సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టీ ఘటన పై స్పందించారు ట్రైనీ ఐపీఎస్.