ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) అసోసియేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ, బి.టెక్/ బీఈ పూర్తిచేసిన అభ్యర్థులు ఏప్రిల్ 27–29 వరకు నిర్వహించే
వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
మొత్తం ఖాళీలు: 29.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 27, 28, 29, 30.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ecruitment.eil.co.inను సందర్శించండి.
