- పవన్ ఖేరా తీరుపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘డరో మత్’ అంటూ నినదించే కాంగ్రెస్ నేతలు చట్టం ముందు మాత్రం ఎందుకు దాక్కుంటున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
ఢిల్లీలో నివసించే పవన్ ఖేరా అస్సాంలో నమోదైన కేసు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో రాజకీయ ఆశ్రయం కోసం వచ్చారా? అని నిలదీశారు. తెలంగాణ హైకోర్టు కేవలం వారం రోజుల మధ్యంతర ఉపశమనం మాత్రమే ఇచ్చిందని, ఆరోపణలపై నమ్మకం ఉంటే చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
