రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ గోదాంలో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. శనివారం ( ఏప్రిల్ 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మొయినాబాద్ మండల కేంద్రంలోని రత్నదీప్ వెనకాల ఉన్న ప్రైవేట్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
ప్రమాదం జరిగిన గోదాం పక్కనే పెట్రోల్ పంప్ కూడా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ పరిసరాలను కమ్మేసింది. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.
ALSO READ : మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణం..
ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
