ప్రజాస్వామ్య వ్యవస్థలో అరెస్ట్ ఇలానే చేస్తారా?

ప్రజాస్వామ్య వ్యవస్థలో అరెస్ట్ ఇలానే చేస్తారా?

జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన తీరును మాజీ ఎంపీ, బీజేపీ నేత  వివేక్ వెంకటస్వామి తప్పుబట్టారు. ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లిన ఆయనను.. మఫ్టీలో వచ్చిన పోలీసులు మల్కాజిగిరిలో అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ట్వీట్ చేసిన వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో అరెస్ట్ ఇలానే చేస్తారా? జర్నలిస్టు రఘును అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఆటవిక,నియంత,దొరల పాలన ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. గూండాలు కిడ్నప్ చేసినట్టుగా నడీరోడ్డు మీద ఎత్తుకెళ్లడం చూస్తే KCR పాలన ఖచ్చితంగా గూండా ప్రభుత్వం అని నిరూపణ అవుతుంది‘ అని ట్వీట్ చేశారు.