కోదాడలో బండి సంజయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ డీజీపీకి కంప్లైంట్ చేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి విజయ రామారావు... బండి సంజయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు , అరాచక శక్తులు కావాలనే దాడి చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని..అధికార పార్టీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలకు ఆదర్శంగా ఉండాలని..హుందాగా మెలగాలన్నారు. దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని తెలిపారు. గతంలో గుర్రం పోడులో కూడా ఇలాగే జరిగిందన్న ఆయన..ఇది మొదటి ఘటన కాదన్నారు. వివిధ జిల్లాల్లో కూడా దాడి జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఒక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయిన మా నాయకునికి తగిన రక్షణ కల్పించాలని కోరామని చెప్పారు విజయ రామారావు.
