డీలిమిటేషన్ పై కేంద్రం తీరును తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి..ఇపుడున్న సీట్లలో 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. శిఖండిని అడ్డుపెట్టుకున్నట్టుగా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉండాలన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉంటే దక్షిణాదికి నష్టమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సీట్లలో ఉత్తరాదికి- దక్షిణాదికి గ్యా్ప్ 412 సీట్లు, పెంచిన తర్వాత నార్త్, సౌత్ గ్యాప్ 620 సీట్లు అవుతుంది.. అపుడు ఉత్తరాదికి 208 సీట్లు అదనంగా వస్తాయన్నారు.
ఉత్తరాది,దక్షిణాదికి గ్యాప్ మంచిది కాదన్నారు రేవంత్. పొలిటికల్ సెంటర్లుగా నార్త్ రాష్ట్రాలు..ఫైనాన్షియల్ సెంటర్లుగా దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయన్నారు. పన్నులు కట్టం, సలాం కొట్టే విధానికి తాము వ్యతిరేకమన్నారు.రాష్ట్రాల జీఎస్ డీపీ ఆధారంగా డీలిమిటేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలన్న రేవంత్.. దేశానికి అత్యధిక ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా.? అని ప్రశ్నించారు.
డీలిమిటేషన్ బిల్లుపై విస్తృత చర్చల తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. పెంచాలనుకుంటున్న 273 సీట్లను సగం జనాభా ఆధారంగా..సగం ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పెంచాలని సూచించారు రేవంత్. డీలిమిటేషన్ పై ఎక్స్ పర్ట్ కమిటీ వేసి అసెంబ్లీల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు .

