సునేత్రకు పదవి వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌మైండ్ బీజేపీ నాయకత్వమే.. శివసేన (యూబీటీ) పత్రిక సామ్నా ఆరోపణలు

సునేత్రకు పదవి వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌మైండ్ బీజేపీ నాయకత్వమే.. శివసేన (యూబీటీ) పత్రిక సామ్నా ఆరోపణలు

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ లీడర్​సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయడం వెనుక బీజేపీ నాయకత్వమే మాస్టర్‌‌‌‌‌‌‌‌మైండ్ అని ప్రతిపక్ష శివసేన(యూబీటీ) మౌత్‌‌‌‌‌‌‌‌పీస్ 'సామ్నా' పత్రిక ఎడిటోరియల్ ఆరోపించింది. రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ కలవాలని బీజేపీ నాయకత్వం, అధికార ఎన్సీపీ నాయకులు సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ కోరుకోవడంలేదని విమర్శించింది. 

'సామ్నా' ఎడిటోరియల్ ప్రకారం.. అజిత్ పవార్ మరణించిన మూడు రోజులకే సునేత్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంత అర్జెంట్‎గా ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఏముంది..? శరద్​ పవార్‎కు చెప్పకుండానే సునేత్రాతో ప్రమాణస్వీకారం చేయించారు. దీన్నిబట్టి సునేత్రాకు ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవి కేవలం అలంకారప్రాయమే అనిపిస్తున్నది. 

అలా కాకూడదు. ఆమె "గుంగి గుడియా(మాట్లాడని బొమ్మ)" కాకుండా సమర్థవంతంగా పనిచేయాలని 'సామ్నా'  అభిప్రాయపడింది. సనాతన మనస్తత్వం కలిగిన బీజేపీ కూటమిలో ఎన్సీపీ ఉందని, అజిత్ మరణానంతర ఆచారాలు పూర్తి కాకముందే సునేత్ర ప్రమాణం చేయడం హిందుత్వ విశ్వాసాలను అవమానించడమేనని విమర్శించింది.