లీడర్ల భాషను చూసి తొండలు బాధపడుతున్నయ్ : బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌‌‌

లీడర్ల భాషను చూసి తొండలు బాధపడుతున్నయ్ : బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌‌‌
  • బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని, వీళ్ల భాష చూసి తొండలు కూడా బాధపడుతున్నాయనీ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొండల గురించి మాట్లాడటానికి, తోలు తీసేయడం గురించి మాట్లాడటానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదన్నారు. 

గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరగడం కాదు.. దాన్ని ఆచరించడం, గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. గతంలో బీఆర్ఎస్ పదేండ్ల పాటు అసెంబ్లీ సమావేశాలను తక్కువ రోజులు నిర్వహించి రికార్డు సృష్టిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తోందన్నారు.