తొలి స్పీచ్ తోనే అదరగొట్టిన రఘునందన్ రావు

తొలి స్పీచ్  తోనే అదరగొట్టిన రఘునందన్ రావు


గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర గీతాన్ని వినిపించి ఉంటే బాగుండేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు.. గవర్నర్ ప్రసంగం ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నందుకు బాధగా ఉందన్నారు.తెలంగాణ ప్రజలు మరో ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. మల్లన్న సాగర్- కొండపోచమ్మ సాగర్- రంగనాయక సాగర్ భూ నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. భూ నిర్వాసితులకు ఒక్కో ప్రాంతంలో  వేర్వేరుగా నష్టపరిహారం ఇస్తుందన్నారు. గందమల్ల రిజర్వాయర్ సామర్థ్యంపై సభకు క్లారిటీ ఇవ్వాలన్నారు.రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కొన్ని నెలల నుంచి  ఆసరా పెన్షన్స్ ఆగిపోయాయన్నారు. కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చాలా ఆలస్యంగా వస్తున్నాయన్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయలేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గం లో 144 సెక్షన్ , సెక్షన్ 30 పోలీస్ యాక్ట్  24 గంటలు అమలులో ఉండడం బాధాకరమన్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీఐఆర్ పై చిత్తుశుద్ధి ఉంటే తాము కలిసి వస్తామన్నారు. అఖిలపక్షంను కలుపుకొని పోరాటం చేద్దామన్నారు.