
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ టైర్ ఊడిపోయింది. రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా ధూల్ పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. స్పీడ్ తక్కువగా ఉండటంతో ఎవరీకీ ఏమీ కాలేదు. ఇప్పటికే ఎన్నో సార్లు రాజాసింగ్ వెహికిల్ నడిరోడ్డుపై ఆగిపోయింది.
బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజాసింగ్ వాపోయారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా అనేకసార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డుపై ఆగిపోవడంతో రాజా సింగ్ వేరే వాహనాల్లో వెళ్లేవారు.