చంపేస్తం.. గంభీర్ కు వార్నింగ్

చంపేస్తం.. గంభీర్ కు వార్నింగ్

మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ను  చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఇంటర్నేషనల్ నంబర్ నుంచి  కాల్ చేసి తన ఫ్యామిలీని చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారని ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేశారు గంభీర్ . దీనిపై వెంటనే కేసు నమోదు చేసి  విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు తన ఫ్యామిలీకి సెక్యూరిటీ కల్పించాలని కోరారు. గంభీర్ కంప్లైంట్ తో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.