మంజల్‌పూర్ ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం

మంజల్‌పూర్ ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం

గాంధీనగర్: గుజరాత్‌లోని వడోదర జిల్లా మంజల్‌పూర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్‌భాయ్ పటేల్ విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి భీఖాభాయ్ రబారిపై 30,630 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. మొత్తం సతీష్ పటేల్‌కు 55,481 ఓట్లు రాగా.. భీఖాభాయ్ రబారికి 24,851 ఓట్లు దక్కాయి.

విజయంపై సతీష్ పటేల్ స్పందిస్తూ.. మంజల్‌పూర్‌ను బీజేపీ కంచుకోటగా నిలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పేదలకు, అట్టడుగు వర్గాలకు సేవ చేయడమే తమ ధ్యేయమన్నారు. భీఖాభాయ్ రబారి స్పందిస్తూ.. ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, పవర్​ను దుర్వినియోగం చేసిందని విమర్శించారు.