- ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన ప్రజాప్రతినిధుల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సమావేశాల నిర్వహణ, ప్రజాసమస్యలపై పోరాటాలు తదితర అంశాలపై చర్చించారు.
10 జిల్లాల్లో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాలను నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అభయ్ పాటిల్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, హరీశ్ బాబు, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
