చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మంగళవారం (జనవరి 30) న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ మేయర్ గా ఎన్నికయ్యారు. సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు రెండో విడత పోలింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్లు నిరసన ప్రదర్శనతో సభాప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. 

వాస్తవానికి మేయర్ ఎన్నిక జనవరి 18న జరగాల్సి ఉండగా ప్రిసైడింగ్ అధికారి అనిల్ మాసిహ్ ఆరోగ్యం సరిగా లేకపోవంతో కౌన్సిలర్లు ఓటు వేడయానికి కొద్ది క్షణాల ముందు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇది బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. 

డిప్యూటీ కమిషనర్ ఎన్నికలకు తదుపరి తేదీని ఫిబ్రవరి 6 అని ప్రకటించగా.. జనవరి 30న ఎన్నికలు నిర్వహించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు యూటీ ఆదేశించడంతో ఇవాళ (జనవరి 30) నే ఎన్నికలు నిర్వహించారు. 

35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ లో ఆప్, కాంగ్రెస్ల కు కలిపి 20 ఓట్లు ఉండగా, బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు, ఒక ఎంపీ కలిపితే మొత్తం 15 ఓట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 19 కాగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ 16 ఓట్లతో విజయం సాధించారు. 12ఓట్లు ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ వచ్చాయి. 8 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.  దీంతో సభలో ఆప్, కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్  డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు వాకౌట్ చేశారు.