రాష్ట్రంలో రక్తం తగ్గుతుంది

రాష్ట్రంలో రక్తం తగ్గుతుంది

రక్తం నిల్వలు తగ్గుతున్నయ్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్లడ్‌ ‌‌‌బ్యాంకుల్లో కొరత
వైద్య వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆందోళన
కరోనా భయం.. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో ముందుకురాని దాతలు

హైదరాబాద్,వెలుగు: కరోనా ఎఫెక్ట్.. లాక్‌‌‌‌డౌన్ కారణంగా బ్లడ్‌ కు కొరత ఏర్పడింది. డోనర్స్‌ కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నయి. బ్లడ్‌ అత్యవసరమై వచ్చిన వారికి బ్లడ్‌ బ్యాంక్‌‌‌‌ల నిర్వాహకులు అందించలేకపోతున్నరు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ర్టవ్యాప్తంగా 174 బ్లడ్ బ్యాంకులుండగా, అందులో 83 గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్‌ బ్యాంకులో 100 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అత్యవసరమై వచ్చేవారికి అందజేస్తుంటారు. కొందరు ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌ ద్వారానో బ్లడ్‌ డొనేట్‌ చేస్తుంటారు. ఇది కాకుండా విద్యా సంస్థలు, ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు సంస్థలు బ్లడ్‌క్యాంపులు కూడా నిర్వహించి సేకరిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా క్యాంపులకు పర్మిషన్స్‌ లేవు. ఎవరైనా బ్లడ్ డొనేట్‌ చేయాలనుకుంటే నేరుగా బ్లడ్ బ్యాంక్ కే వెళ్లాల్సి ఉంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో డోనర్స్‌ కూడా బయటకు రావడం లేదు.

వీరికి బ్లడ్ మస్ట్‌
తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా పేషెంట్లకు ప్రతి నెలా మస్ట్‌గా బ్లడ్‌ ఎక్కించాలి. వీరు అందుబాటులోని బ్లడ్‌బ్యాంకుల్లో ముందుగానే పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం వీరికి, ఎమర్జెన్సీ డెలివరీ కేసులకు మాత్రమే బ్లడ్ ఇస్తున్నామని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక వీరితో పాటు కేన్సర్ పేషెంట్లకు కూడా వైట్ బ్లడ్ సెల్స్ అవసరమవుతాయి. వీటి నిల్వలు కూడా లేవు.

లాక్‌డౌన్‌ కారణంగా..
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ కారణంగా ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోవడంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో రక్తం కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని బ్లడ్ నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో సాధారణ సర్జరీలు నిలిపివేయడంతో రక్తానికి డిమాండ్‌ తగ్గింది. అయినా బ్లడ్‌ కొరత ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

ఐపీఎంల ద్వారా కలెక్షన్‌
ప్రభుత్వాసుపత్రులకు డోనర్స్‌ రాకపోతుండడంతో ఐపీఎం(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌‌‌‌)ద్వారా బ్లడ్ కలెక్షన్ చేయాలని మెడికల్‌ డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ గవర్నమెంట్‌ బ్లడ్‌ బ్యాంకుల స్టాఫ్‌తో మీటింగ్‌ నిర్వహించారు.

కొవిడ్ బ్లడ్ బ్యాంక్ పెడతం: ముందుకొచ్చిన బయోకాన్ కంపెనీ
కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల కోసం యాంటీ బాడీరిచ్ ప్లాస్మా కొవిడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని బయోకాన్ కంపెనీ ముందుకు వచ్చింది.ఈ విషయమై మంత్రి కేటీఆర్ తో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ పర్సన్ కిరణ్ మంజుందార్ షా ఫోన్ చేసినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైద్య శాఖకార్యదర్శి, కమిషనర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కిరణ్ మంజుందార్ షాకు ‘థ్యాంక్స్ కిరణ్’అంటూ ధన్యవాదాలు తెలిపారు.

ఆర్మీ వాళ్లు డొనేషన్
విద్యానగర్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ ‌‌‌బ్యాంకులో 700–800యూనిట్ల బ్లడ్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఉంటుంది. ప్రస్తుతం వాటిసంఖ్య చాలా తగ్గింది. ఇక్కడికి రోజూ తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియాపేషెంట్లు 25–30మందివరకు వచ్చి బ్లడ్‌‌‌ ఎక్కించుకుంటారు. ప్రస్తుతం ట్రాన్స్ పోర్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌తో కొంతమంది రావడం లేదని తెలిసింది. వచ్చిన వారికి అందిస్తున్నాం. లాక్ డౌన్‌‌‌‌తో డోనర్స్‌‌‌‌ కూడా తగ్గిపోయారు. ఈ విషయాన్ని గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెళ్లాం. ఆమె స్పందించి ఆర్మీ ఆఫీసర్స్‌‌‌కు చెప్పడంతో ప్రస్తుతం రోజూ 20యూనిట్లు డొనేట్‌ చేస్తున్నారు. ఇది కూడా సరిపోవడం లేదు. బ్లడ్ డొనేట్‌ చేసేందుకు ముందుకు రావాలి. ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ 7032888001ను సంప్రదించాలి.
– డాక్టర్ కె.పిచ్చిరెడ్డి, రెడ్‌‌‌‌క్రాస్‌‌‌‌ బ్లడ్‌‌‌‌బ్యాంకు డైరెక్టర్

డోనర్స్‌ ముందుకు రావాలి
బ్లడ్‌‌‌‌ ఇచ్చేందుకు డోనర్స్‌‌‌‌ రావడం లేదు. ఇంతకుముందుతో పోల్చితే 90శాతం తగ్గిపోయారు. కరోనా ఐసోలేషన్ వార్డులు ఉండడంతోనే బ్లడ్ డొనేట్‌ చేసేందుకు రావడం లేదని అంటున్నారు. మా వద్ద స్టాక్ లేని బ్లడ్ గ్రూప్‌లను ఐపీఎం నుంచి తెప్పించి రోగులకు అందిస్తున్నాం. బ్లడ్ డొనేట్‌ చేసేందుకు డోనర్స్‌‌‌‌ ముందుకు రావాలి.

మానవత్వంతో ఆదుకోవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో డోనర్స్‌‌‌‌ మానవత్వంతో ముందుకొచ్చి బ్లడ్ డొనేట్‌ చేయాలి. కొన్ని రకాల బ్లడ్ గ్రూపులు తక్కువ మందిలో ఉంటాయి. అలాంటి సమయంలో బ్లడ్ అత్యవసరమైతే చాలా కష్టమవుతుంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదముంది. బ్లడ్ ఎమర్జెన్సీ అయితే డోనర్స్ కి కాల్ చేసి పిలుస్తున్నాం.
– లక్ష్మిరెడ్డి, తెలంగాణ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షురాలు

For More News..

ఒక్కో బస్సులో 100 మంది.. మరి వీరికి రాదా కరోనా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

విద్యార్థులను ప్రమోట్ చేద్దామా.. పరీక్షలు పెడదామా?

ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టి వేత