సంగి గూడ పెద్ద చెరువులో బోటింగ్ కోసం పడవ ఏర్పాటు

సంగి గూడ పెద్ద చెరువులో బోటింగ్ కోసం పడవ ఏర్పాటు

శంషాబాద్ మండల పరిధి సంఘీ గూడా గ్రామంలో పెద్ద చెరువు గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండింది. దీంతో సర్పంచ్ గుర్రం పద్మావతి అనంతరెడ్డి, చిన్న గోల్కొండ సొసైటీ డైరెక్టర్ గుర్రం అనంతరెడ్డి కలిసి గ్రామ ప్రజల కోసం పెద్ద చెరువులో ఒక బోట్ ను ఏర్పాటు చేశారు. పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పదిమంది కెపాసిటీ తో తిరిగే పడవను తయారు చేయించి ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ సక్సెస్ కావడంతో 9వ తేదీన అధికారికంగా బోటింగ్ ప్రారంభించానున్నారని అనంతరెడ్డి తెలిపారు. 

రంగారెడ్డి జిల్లాలో బోటింగ్ పర్యటన కోసం ఎక్కడా లేని విధంగా గ్రామ సర్పంచ్ ఈ పడవను ఏర్పాటు చేయడం సంతోషకరమని గ్రామస్థులు తెలిపారు. ఇంటి పక్కనే ఈ ఒక్క బోటింగ్ ఉండడం వల్ల చాలా మంది ఈ షికారులో పాల్గొంటారని చెప్పారు. ఈ బోటింగ్ లో ఏలాంటి ఇబ్బందులు లేకుండా షికారు చేసే వారికి, చిన్నారులకు లైఫ్ గాడ్ జాకెట్లను, ఇద్దరు గజ ఈతగాళ్లను బోట్లో ప్రతి ప్రయాణంలో అందుబాటులో ఉంటారని గ్రామ సర్పంచ్ స్పష్టం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో చిన్న గోల్కొండ నరసింహ చెరువులో కూడా ఇలాంటి బోటింగ్ ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో  చిన్న గోల్కొండ నరసింహ చెరువు సంఘీ గూడా పెద్ద చెరువు రెండింటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.