V6 News

టీశాట్ ​సీఈవోగా బోదనపల్లి వేణుగోపాల్​ రెడ్డి

టీశాట్ ​సీఈవోగా బోదనపల్లి వేణుగోపాల్​ రెడ్డి


హైదరాబాద్,వెలుగు:  తెలంగాణ స్కిల్, అకాడమిక్ అండ్ ట్రైనింగ్ శాటిలైట్ టీవీ(టీ–శాట్)  సీఈవోగా ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అపాయింట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం కొరటికల్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి.. తెలంగాణ యూనివర్సిటీలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చదివారు. విద్యార్థి దశలో తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. జర్నలిజంలో 17 ఏండ్ల అనుభవం ఉన్న ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేశారు.