అన్నపూర్ణ స్టూడియోలో బౌన్సర్ల హల్ చల్

అన్నపూర్ణ స్టూడియోలో బౌన్సర్ల హల్ చల్

అన్నపూర్ణ స్టూడియోలో బౌన్సర్ లు హల్ చల్ చేశారు. ఓ ప్రెస్ మీట్ కోసం అక్కడికి వచ్చిన మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించారు. అన్నపూర్ణ స్టూడియోలో హీరోయిన్ తమన్నా నటించిన 'బబ్లీ బౌన్సర్' మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ కోసం మూవీ టీమ్ 10 మందికి పైగా బౌన్సర్ లను ఏర్పాటు చేసుకుంది.

ప్రెస్ మీట్ ముగిశాక.. మీడియా ప్రతినిధులు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. దీంతో అక్కడున్న బౌన్సర్ లు ఓవర్ యాక్షన్ చేశారు. బౌన్సర్ లకు, మీడియా ప్రతినిధులకు మధ్య మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో కెమెరామెన్ యుగంధర్, శ్రీనివాస్ లకి గాయాలయ్యాయి.