బీఫార్మసీ, ఫార్మ్‌‌-డీ అడ్మిషన్ షెడ్యూల్‌‌ రిలీజ్..సెప్టెంబర్ 3, 4 తేదీల్లో వెబ్‌‌ ఆప్షన్లకు అవకాశం

బీఫార్మసీ, ఫార్మ్‌‌-డీ  అడ్మిషన్ షెడ్యూల్‌‌ రిలీజ్..సెప్టెంబర్  3, 4 తేదీల్లో వెబ్‌‌ ఆప్షన్లకు అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజైంది. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఆన్‌‌లైన్‌‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన సూచించారు. వచ్చేనెల 4న ఆప్షన్లను ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 

ఇప్పటికే ఈఏపీసెట్-2026 ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌‌లో ఇంజినీరింగ్ బ్రాంచ్‌‌లలో చేరిన విద్యార్థులు.. బీఫార్మసీ, ఫార్మాడీ ఆప్షన్లు పెట్టుకోవడానికి అనర్హులని తెలిపారు. ఈ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కేవలం ఒకే విడతలో ఉంటుందని, విద్యార్థులు జాగ్రత్తగా ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 6న  సీట్ల కేటాయింపు, సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 7న ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు.