బీఫార్మసీ రీఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్.. అప్పుడు రాయనోళ్లు ఇప్పుడు రాయొచ్చు..

బీఫార్మసీ రీఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్.. అప్పుడు రాయనోళ్లు ఇప్పుడు రాయొచ్చు..

హైదరాబాద్: బీఫార్మసీ రీఎగ్జామ్ షెడ్యూల్‎ను జేఎన్టీయూ అధికారులు మంగళవారం (జనవరి 6) రిలీజ్ చేశారు. 2026, జనవరి 27, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 2025, నవంబర్ 4, 6 తేదీల్లో బీఫార్మసీ పరీక్షలు జరిగాయి. అయితే.. ప్రైవేటు కాలేజీల సమ్మెతో కొందరు విద్యార్థుల పరీక్షలు రాయలేదు. ఎగ్జామ్స్ మళ్లీ కండక్ట్ చేయాలని కోరారు. విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రీఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అప్పుడు రాయని వాళ్లకు జనవరి 27, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే.. అప్పుడు పరీక్ష రాసిన విద్యార్థులు మళ్లీ రాస్తే పాత మార్కులు వదులుకోవాల్సిందేనని అధికారులు క్లారిటీ ఇచ్చారు. 

►ALSO READ | జీహెచ్ఎంసీకి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు.. ఎందుకంటే..?