హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కురిపించింది. నగరంలో డెంగ్యూ నియంత్రణకు జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మంగళవారం (జనవరి 6) నాగ్‌పూర్‌లో జరిగిన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్స్ జాతీయ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025లో హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులను గణనీయంగా తగ్గించిన విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు.
ALSO READ : యూపీలో లక్ష కాదు.. రెండు లక్షలు కాదు..
వెక్టర్ బోర్న్ డిసీజెస్ యాప్ ద్వారా డెంగ్యూ కేసుల పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం చేశామని తెలిపారు. జీఐఎస్ ఆధారిత డ్యాష్ బోర్డులు, రియల్ టైమ్ డేటా అప్ డేట్స్‌తో క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా కేసులు తగ్గించగలిగామని చెప్పారు. సాంకేతికత ఆధారిత, డేటా డ్రివెన్ విధానంతో వ్యాధుల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. దీంతో జీహెచ్ంఎసీ శాఖల మధ్య సమన్వయంతో చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. డెంగ్యూ నియంత్రణలో జీహెచ్ఎంసీ మోడల్ ఇతర పట్టణాలకు ఆదర్శమని పేర్కొంది.
