నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి

నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి

ప్రభుత్వ కాలేజీ భూముల్లో ఒక్క ఇంచు తేడా వచ్చిన రాజీనామా చేస్తానన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి. దొంగ ఎవరో దొర ఎవరో ప్రజలకు తెలుసన్నారు.  ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిని రణరంగంగా మార్చారని ఫైర్ అయ్యారు. తనను చంపుతామని బెదిరించారని..ఇవాళ ఆ పనిచేశారని ఆరోపించారు. తాను పలిస్తే వేలమంది రోడ్లమీదకు  వచ్చేవాళ్లు..అపుడు పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు వెంకటరమణా రెడ్డి. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.

 రేపటి నుంచి గ్రామాల్లో తిరుగుతా. ఇక యుద్ధ వాతారణమేనని హెచ్చరించారు ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి.తనపై ఏం జరిగినా ప్రభుత్వానిది, సీఎందే బాధ్యత అనిచెప్పారు. ఇవాళ కారు బోల్తా పడింది రేపు మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందన్నారు. తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో  తన నిజాయితీ నిరూపించుకునేదాక ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.  ఇప్పటి వరకు కామారెడ్డిలో ఏది జరిగిన భరించా ఇక నుంచి  భరించే ప్రసక్తే లేదన్నారు వెంకటరమణా రెడ్డి.