ఆదాయానికి మించిన ఆస్తులు.. కల్వకుర్తి ఏడీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తులు.. కల్వకుర్తి ఏడీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు

గరిడేపల్లి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఏడీఏగా పనిచేస్తున్న సుందర్ కిరణ్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పొనుగోడు గ్రామంలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్లు అధి కారులు వెల్లడించారు. గడ్డిపల్లి గ్రామంలోని బంధువుల ఇల్లు, అనంతగిరి మండలంలోని అమీనాబాద్, తుక్కుగూడతో పాటు నేరేడుచర్ల మండలం చిల్లపల్లి వద్ద ఆయనకు భాగస్వామ్యం ఉన్న రైస్ మిల్, కల్వకుర్తిలోని ఇతర ఆస్తులపై సోదాలు కొనసాగినట్లు సమాచారం. 

గతంలో ఆయన సూర్యాపేట జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదు లు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహబూబ్న గర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ అండదండలతో అగ్రికల్చర్ డి పార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్ పై సూర్యాపేట జిల్లాకు వచ్చి చాలా అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

►ALSO READ | మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి : మంత్రి సీతక్క