బ్రిటన్ ఈయూ జర్నీ ముగిసింది
ఇది అద్భుతమైన క్షణమన్న ప్రధాని బోరిస్ జాన్సన్
ఇతర దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకునే స్వేచ్ఛ లభించిందని వెల్లడి
లండన్: బ్రిటన్ బ్రెగ్జిట్ జర్నీ ముగిసింది. యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రాన్సిషన్ పీరియడ్ గురువారం రాత్రి 11 గంటలకు ముగిసింది. ‘మా దేశానికి ఇది అద్భుతమైన క్షణం. మా ఫ్రీడమ్ మా చేతుల్లోకి వచ్చింది. ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే స్వేచ్ఛ లభించింది’ అని న్యూ ఇయర్ వీడియో మెసేజ్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. బ్రెగ్జిట్ కోసం ప్రచారం చేసిన కన్జర్వేటివ్ లామేకర్ మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వానికి దక్కిన విజయంగా చెప్పారు. ఈయూ నుంచి బయటకు వచ్చేందుకు 2016లో బ్రిటన్ రెఫరెండం నిర్వహించింది. 52% మంది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. తర్వాత బ్రిటన్‌లో ముగ్గురు ప్రధానులు మారారు. రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో అధికారంలోకి వచ్చిన బోరిస్ జాన్స్ బ్రెగ్జిట్‌ను కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు 2020 జనవరి 31న ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేసింది. ట్రాన్సిషన్ పీరియడ్ కూడా ముగిసింది. ఈయూ మెంబర్‌షిప్‌ను బ్రిటన్ వదులుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌లో జరిగిన అతిపెద్ద ఎకనామిక్ చేంజ్ ఇదే కావడం గమనార్హం. జనవరి 1 నుంచి కొత్త ట్రేడ్ -డీల్ అమల్లోకి వచ్చింది. దీంతో బ్రిటన్, ఈయూ దేశాల మధ్య ఆంక్షలు మొదలు కానున్నాయి. బ్రిటన్, ఈయూ మధ్య కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ ప్రభావం రాబోయే రోజుల్లో కనిపిస్తుందని, లాజిస్టిక్స్ ఇండస్ట్రీపై పెద్ద ప్రభావమే పడుతుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
For More News..
తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న స్కూల్స్
వీసాలపై నిషేధాన్ని పొడిగించిన ట్రంప్
స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా ఆక్సిడెంట్.. ఇద్దరు మృతి
