బీజేపీకి అనుబంధ పార్టీగా బీఆర్‌‌‌‌ఎస్..ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపణ

బీజేపీకి అనుబంధ పార్టీగా బీఆర్‌‌‌‌ఎస్..ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీకి అనుబంధ పార్టీగా బీఆర్ఎస్ తయారైందని ఫిషరీస్ ఫెడరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌‌కు అన్యాయం జరిగితే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండని ఫైర్ అయ్యారు.

ఈ మేరకు గురువారం ఆయన గాంధీ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఒక సాదాసీదా మహిళను, గాంధేయవాది అయిన మీనాక్షి నటరాజన్‌‌ను బీజేపీ రాజకీయ ఇబ్బందులకు గురిచేస్తే కనీస సానుభూతి చూపని బీఆర్ఎస్.. బీజేపీ చర్యలకు వంతపాడడం సిగ్గుచేటన్నారు.