ఫిల్మ్ నగర్‌లో యువకుడి దారుణ హత్య 

ఫిల్మ్ నగర్‌లో యువకుడి దారుణ హత్య 

హైదరాబాద్ లో యువకుడి హత్య జరిగింది. ఫిల్మ్ నగర్‌లో సోమవారం ప్రేమ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే స్నేహితులే ప్రేమ్‌ను కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. ప్రేమ్‌కు, సతీశ్‌ అనే వ్యక్తికి మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి తాగుదామని సతీశ్‌ అనే వ్యక్తి ప్రేమ్‌ను పిలిచాడు. గంజాయి తాగిన తర్వాత మత్తులో ప్రేమ్‌కు, సతీశ్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మిగతా వ్యక్తులు ప్రేమ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.