ఐసీసీ నం.1 బౌలర్… బుల్లెట్ బుమ్రా

ఐసీసీ నం.1 బౌలర్… బుల్లెట్ బుమ్రా

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో జస్ ప్రీత్ బుమ్రా తన నంబర్ వన్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. వరల్డ్ వైడ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ ను ఐసీసీ ప్రకటించింది. ఈ ర్యాంక్స్ లో భారత స్పీడ్ గన్, ఫాస్ట్ బౌలింగ్ సంచలనం బుమ్రా నంబర్ వన్ గా నిలిచాడు.

బుమ్రా 814 పాయింట్లతో టాప్ లో ఉంటే.. 758 పాయింట్స్ తో ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో నిలిచాడు. వీరి స్థానాల్లో మార్పులేదు.

ప్యాట్ కమిన్స్ ర్యాంకింగ్స్ లో 3 స్థానాలు మెరుగుపరుచుకుని మెరుగై.. మూడో నంబర్ కు వచ్చాడు. ముజీబుర్ రెహ్మాన్ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి… ఆరో స్థానానికి జంప్ కొట్టాడు. మిషెల్ స్టార్క్ 15 స్థానాలు దాటి… టాప్ 7 గా నిలిచాడు. లాకీ ఫెర్గుసన్ కూడా టాప్ 10లోకి వచ్చేశాడు. రషీద్ ఖాన్ ఐదు స్థానాలు కోల్పోయి 8వ పొజిషన్ లో నిలిచాడు.