బన్నీ ఫోటో షూట్ క్యాన్సిల్ చేసిండని ఏడ్చిన్రు

బన్నీ ఫోటో షూట్ క్యాన్సిల్ చేసిండని ఏడ్చిన్రు

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. పుష్ప సినిమాతో  బాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్  భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కేరళలో ఇప్పటికే బన్నీకి అక్కడి టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. ఎక్కడికెళ్లిన అభిమానులు బన్నీని చుట్టుముడుతుంటారు.

లేటెస్ట్ గా  సుకుమార్ డైరెక్షన్ లో  బన్నీ నటిస్తోన్న పుష్ష 2 షూటింగ్  వైజాగ్ లో జరుగుతోంది.  దీంతో తన అభిమాన హీరో బన్నీని  చూడటానికి  ఫ్యాన్స్  ఎగబడ్డారు. ఈ  షూటింగ్ గ్యాప్ లో బన్నీ తన ఫ్యాన్స్ కోసం ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. దీంతో ఫోటోలు దిగేందుకు అభిమానులు  క్యూ కట్టారు. కానీ ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువగా రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో బన్నీ ఫోటో షూట్ క్యాన్సిల్ చేసుకున్నాడు.  ఫోటోలు దిగకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఫ్యాన్స్  నిరాశతో వెనక్కి  వచ్చారు. కొందరు అభిమానులు అయితే స్టేజ్ పైనే కన్నీళ్లుపెట్టుకున్నారు. ఎంతో దూరంతో వస్తే తన అభిమాన హీరో ఫోటోలు దిగకుండానే  వెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది బాధపడుతున్నారని అల్లు అర్జున్ ఒక్కసారి తమ గురించి ఆలోచించాలని వేడుకుంటున్నారు.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.