కేంద్రం నిర్ణయం : ఇకపై కేన్సర్ మందులు అగ్గువ

కేంద్రం నిర్ణయం : ఇకపై కేన్సర్ మందులు అగ్గువ

న్యూఢిల్లీ: కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే 42 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. వీటి అమ్మకాలపై లాభాలు 30 శాతానికి పరిమితం కానున్నాయి. ధరల తగ్గింపునకు నేషనల్‌‌‌‌ ఫార్మాసూటికల్‌‌‌‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌‌‌‌పీపీఏ) అసాధారణ అధికారాలు ఉపయోగించింది. 30 శాతం మార్జిన్‌‌‌‌ను కలుపుకొని 7 రోజుల్లోగా ధరలు నిర్ణయించాలని ఫార్మా కంపెనీలను ఆదేశించినట్లు డిపార్ట్‌‌‌‌మెంట్‌ ఆఫ్‌‌‌‌ ఫార్మాసూటికల్స్‌‌‌‌ నోటిఫికేషన్ లో తెలిపింది. దీంతో 105 కంపెనీల కేన్సర్ మందుల ఎమ్మార్పీ 85 శాతం వరకు తగ్గనున్నాయి. ప్రస్తుతం 57 కేన్సర్‌ చికిత్స మందులు ధరల నియంత్రణ పరిధిలో ఉన్నాయి. కొత్త ధరలు వచ్చే నెల 8 నుంచి అమల్లోకి వస్తాయి.