గ్రూప్ 1 ఉద్యోగుల ఎంపిక సక్రమమే : లైన్ క్లియర్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్

గ్రూప్ 1 ఉద్యోగుల ఎంపిక సక్రమమే : లైన్ క్లియర్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్

గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో  ఊరట లభించింది.  సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును  కొట్టివేసింది.  గ్రూప్ 1 పరీక్షలు పారదర్శకంగా జరిగాయని చెప్పింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని తెలిపింది. 

 గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని తెలిపింది. సింగిల్ జడ్జి  ఇచ్చిన ఈ ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థుల హైకోర్టులో  అప్పీల్ చేశారు. ఫిబ్రవరి 5న అప్పీల్ ను విచారించిన హైకోర్టు.. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 562 మంది అభ్యర్థులకు ఊరట లభించినట్టు అయ్యింది.    

2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 21 వేల మందికి పైగా పరీక్షలకు అటెండ్ అయ్యారు. మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్ 1 టాపర్‌‌గా లక్ష్మీదీపిక నిలిచారు. గ్రూప్ 1 కు ఎంపికైన మొత్తం 562 మందికి 2025 సెప్టెంబర్ 27న  సీఎం రేవంత్ రెడ్డి  నియామక పత్రాలు అందించారు.