హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా దగ్గర కారులో మంటలు..

హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా దగ్గర కారులో మంటలు..

హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా దగ్గర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కింద పిల్లర్ నంబర్ 312 సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదం. బుధవారం ( ఏప్రిల్ 30 ) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది.

మంటలు చెలరేగడం గమనించిన నలుగురు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. జూ పార్క్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.