ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌తొలిసారి చేరిక

ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌తొలిసారి చేరిక
  •         మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌, బోపన్న జోడీ ముందంజ

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌ ‌‌‌‌‌‌‌:  స్పెయిన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 6–4, 6–4, 6–0తో మియోమిర్‌‌‌‌‌‌‌‌ కెక్మనోవిక్‌‌‌‌‌‌‌‌ (సెర్బియా)ను ఓడించాడు.  గంటా 49 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 5 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 43 విన్నర్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. 19 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేసినా 5 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాచుకుని ఈజీగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు.

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో థర్డ్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌ డానియెల్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా) 6–3, 7–6 (7/4), 5–7, 6–1తో నునో బోర్గెస్‌‌‌‌‌‌‌‌ (పోర్చుగల్‌‌‌‌‌‌‌‌)పై గెలవగా, అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) 7–5, 3–6, 6–3, 4–6, 7–6 (10/3)తో 19వ సీడ్‌‌‌‌‌‌‌‌ కామెరూన్‌‌‌‌‌‌‌‌ నోరి (బ్రిటన్‌‌‌‌‌‌‌‌)పై చెమటోడ్చి నెగ్గాడు. ఈ టోర్నీలో జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ ఐదు సెట్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడటం ఇది మూడోసారి కాగా, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఇప్పటి వరకు మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌లో 32వ ఐదుసెట్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌. ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఎరాలో హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌ ఐదుసెట్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన టోర్నీగా రికార్డులకెక్కింది.

మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హుబెర్ట్‌‌‌‌‌‌‌‌ హుర్కాజ్‌‌‌‌‌‌‌‌ (పోలెండ్‌‌‌‌‌‌‌‌) 7–6 (8/6), 7–6 (7/3), 6–4తో ఆర్థర్‌‌‌‌‌‌‌‌ కాజాక్స్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో విక్టోరియా అజరెంకాకు షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ డయానా యాస్ట్రేమస్కా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) 7–6 (8/6), 6–4తో అజరెంకా (బెలారస్‌‌‌‌‌‌‌‌)ను ఓడించింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నోస్కోవా (చెక్‌‌‌‌‌‌‌‌) 3–0తో ఉన్నప్పుడు స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) రిటైర్డ్‌‌‌‌‌‌‌‌హర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యింది.

క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో బోపన్న జోడీ

మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో రోహన్‌‌‌‌‌‌‌‌ బోపన్న– మాథ్యూ ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) జోడీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ బోపన్న–ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ 7–6, 7–6తో వెస్లీ కూల్‌‌‌‌‌‌‌‌హోఫ్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌)–నికోలా మెక్టిక్‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా)పై నెగ్గారు.  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో బోపన్న ద్వయం మాక్సియో గోంజాలెజ్‌‌‌‌‌‌‌‌–ఆండ్రెస్‌‌‌‌‌‌‌‌ మోల్టిని (అర్జెంటీనా)తో తలపడుతుంది.