బ్యాంకులను నట్టేట ముంచిన ఏబీజీ షిప్ యార్ట్

బ్యాంకులను నట్టేట ముంచిన ఏబీజీ షిప్ యార్ట్

దేశంలో మరో భారీ బ్యాంకు స్కాం బయటపడింది. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ దాదాపు రూ. 22,842 కోట్ల బ్యాంకింగ్ ఫ్రాడ్ కు పాల్పడినట్లు సీబీఐ విచారణలో తేలింది. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన సంస్థ ఫౌండర్ ఛైర్మన్ రిషి కమలేష్ అగర్వాల్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం, అధికార దుర్వినియోగం తదితర నేరాల కింద ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 

ఐసీఐసీఐ బ్యాంకు కన్సార్టియంలోని 28 బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల నుంచి ఏబీజీ షిఫ్ యార్డ్ రూ. 22,842  కోట్ల రుణం తీసుకుంది. అందులో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిషి కమలేష్ 2,468.51 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఏబీజీ బండారం బయటపడింది. 2012 నుంచి 2017 మధ్యకాలంలో నిందితుడు నిధులను మళ్లించినట్లు అందులో తేలింది. 2016లో ఏజీబీ షిప్ యార్డ్ బ్యాంక్ అకౌంట్ ను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ (నిరర్థక ఆస్థి)గా పరిగణించగా.. 2019లో మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల ఫిర్యాదుతో సీబీఐ రిషి అగర్వాల్ తో పాటు పలువురిపై ఈ ఏడాది ప్రారంభంలో కేసు నమోదుచేసింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేసింది.