ట్రాన్స్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పోర్టుగా అదానీ విజింజం పోర్ట్‌‌‌‌‌‌‌‌

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పోర్టుగా అదానీ విజింజం పోర్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: కేరళలోని విజింజం పోర్ట్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌మెంట్ పోర్టుగా పనిచేసేందుకు అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు  షిప్పింగ్ మినిస్ట్రీ  అనుమతులు ఇచ్చింది. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌మెంట్ పోర్ట్ ఒక హబ్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ  ఒక షిప్‌‌‌‌‌‌‌‌లోని గూడ్స్‌‌‌‌‌‌‌‌ను ఆఫ్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి మరో షిప్‌‌‌‌‌‌‌‌లోకి ఎక్కిస్తారు. సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాంఘై, షెంజాన్‌‌‌‌‌‌‌‌, బుసాన్​, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ పోర్టులు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పోర్టులు.  

దేశంలోని మొదటి డీప్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పోర్టుగా  విజింజం పోర్ట్ నిలిచింది. విజింజం దగ్గర ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను 2015 లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రారంభించింది.  ప్రభుత్వం మరిన్ని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌మెంట్ పోర్టులను ఏర్పాటు చేయాలని చూస్తోంది. గ్రేట్‌‌‌‌‌‌‌‌ నికోబార్ ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌ వద్ద రూ.41 వేల కోట్లతో ఒక పోర్టును నిర్మించే పనిలో ఉంది. మొత్తం 11 కంపెనీలు ఇందుకోసం ఆసక్తి చూపాయి. మొదటి ఫేజ్ 2028 నాటికి పూర్తవుతుందని అంచనా. ఇది 40 లక్షల కంటైనర్లను హ్యాండిల్ చేయగలుగుతుంది.