Pawan Kalyan: సుజిత్‏కి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ గిఫ్ట్.. స్పెషల్ సర్ప్రైజ్‌కు డైరెక్టర్ ఎమోషనల్!

Pawan Kalyan: సుజిత్‏కి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ గిఫ్ట్.. స్పెషల్ సర్ప్రైజ్‌కు డైరెక్టర్ ఎమోషనల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్ బాయ్, దర్శకుడు సుజిత్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.  సెప్టెంబర్ 25, 2025న విడుదలైన 'ఓజీ' (They Call Him OG) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం కేవలం ఓపెనింగ్ రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ155 కోట్ల వసూళ్లను సాధించింది.  ప్రపంచ వ్యాప్తంగా  రూ 295 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ గ్రాండ్ సక్సెస్‌తో ఖుషీ అయిన పవన్.. సుజిత్‌పై తనకున్న ప్రేమను ఒక లగ్జరీ కారు రూపంలో చాటుకున్నారు.

తొలిసారి ఒక దర్శకుడికి పవన్ గిఫ్ట్!

పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమాల విషయంలో చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. అయితే, ఒక దర్శకుడి పనితీరుకు మెచ్చి ఆయన కారును బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి. సుజిత్ దర్శకత్వ ప్రతిభకు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఫిదా అయిన పవన్,  కోట్ల రూపాయల విలువ చేసే డిఫెండర్ లగ్జరీ కారును స్వయంగా అందజేశారు.

Also read:- సీక్రెట్ మ్యారేజ్‍పై మౌనం వీడిన మెహ్రీన్ పీర్జాదా!

సుజిత్ ఎమోషనల్..

తన ఆరాధ్య దైవంగా భావించే పవన్ కళ్యాణ్ నుంచి అందిన ఈ అద్భుతమైన బహుమతిని చూసి సుజిత్ ఉద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా కారు ఫోటోను షేర్ చేస్తూ తన కృతజ్ఞతలు తెలిపారు. "నేను అందుకున్న బహుమతుల్లో ఇది అత్యుత్తమమైనది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ప్రియమైన ఓజీ, కళ్యాణ్ నుండి లభించిన ఈ ప్రోత్సాహం నాకు ప్రాణప్రదం. చిన్ననాటి నుంచి ఆయన అభిమానిగా ఉంటూ..  నేడు ఆయనతో సినిమా తీసి, ఇలాంటి గుర్తింపు పొందడం నా అదృష్టం. ఈ క్షణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను.. అని సుజిత్ పేర్కొన్నారు.

 తమన్ విషెస్..

ఈ వార్త తెలియగానే సుజిత్‌కు చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్  శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన తమ్ముడు సుజిత్.. నీకు అన్నిటికంటే ఉత్తమమైనవే దక్కాలి. మన 'లీడర్' పవన్ కళ్యాణ్  నుంచి ఇలాంటి బహుమతి రావడం నీ హార్డ్ వర్క్,డెడికేషన్‌కు దక్కిన గుర్తింపు. ఒక సోదరుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. నీ ఆలోచనల వేగాన్ని పెంచి, సినిమాలో మరిన్ని అద్భుతాలు సృష్టించు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఫ్యాన్స్ సంబరాలు

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఒక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ రావడం, అది బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సుజిత్ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం, పవన్‌ను చూపించిన స్టైలిష్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ విజయం సుజిత్‌ను టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో నిలబెట్టింది. మొత్తానికి, 'ఓజీ' విజయం పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. సుజిత్‌కు అందిన ఈ గిఫ్ట్.. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుందనడానికి ఒక నిదర్శనం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.