భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. గత ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అయ్యర్ కోసం ఆర్సీబీ ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం కోల్‌కతాతో పోరాడి 7 కోట్లకు వెంకటేష్ అయ్యర్‌ను దక్కించుకుంది. గత సీజన్ లాగే ఈ సారి కూడా వెంకటేష్ అయ్యర్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. పోటాపోటీగా ధర పెంచుకుంటూ వెళ్లాయి. చివరకు రూ.7 కోట్లకు ఆర్సీబీ ఈ ఆల్ రౌండర్ ను కొనుగోలు చేసింది.
గత సీజన్ లో ఘోరంగా విఫలం:
గత సీజన్ లో వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే అయ్యర్ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 11 మ్యాచ్ ల్లో కేవలం 142 పరుగులకే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంలో విఫలం కావడంతో అయ్యర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతమంది రూ. 23.75 కోట్ల రూపాయలు తీసుకున్న మోసగాడు అంటుంటే.. మరికొందరు మెగా ఆక్షన్ లో అయ్యర్ ను కొన్నప్పుడే కేకేఆర్ ఓడిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. కేకేఆర్ మెగా ఆక్షన్ లో అనవసరంగా 23కోట్లు చెల్లించిందని మండిపపడ్డారు.
2025 మెగా ఆక్షన్ లో కేకేఆర్ కు వెంకటేష్:
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టాడు. వేలంలో వెంకటేశ్ అయ్యర్ ఊహించని రీతిలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయ్యర్ కోసం వేలంలో ఆర్సీబీ, లక్నో, కోల్ కతా హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఈ ఆల్ రౌండర్ ను దక్కించుకునేందుకు పోటా పోటీగా ధర పెంచుకుంటూ పోయాయి. అయితే.. అంతా భారీ ధర పెట్టలేక ఆక్షన్ నుండి లక్నో, ఆర్సీబీ వెనక్కి తగ్గడంతో చివరకు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను తిరిగి దక్కించుకుంది.
