Akhil Akkineni: బాలీవుడ్ బ్యూటీతో అఖిల్ మాస్ డ్యాన్స్.. 'లెనిన్' కోసం అనన్య పాండే ఎంట్రీ!

Akhil Akkineni: బాలీవుడ్ బ్యూటీతో అఖిల్ మాస్ డ్యాన్స్.. 'లెనిన్' కోసం అనన్య పాండే ఎంట్రీ!

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నుంచి రాబోతున్న లేటెస్ట్, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'లెనిన్'. వరుస అజయాలతో ఉన్న  అఖిల్ ఈ సారి గట్టిగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.  విభిన్న కథాంశాలతో ఈసారి పక్కా మాస్, యాక్షన్ డ్రామాతో పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి మురళీ కే కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాకు అక్కినేని కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు, ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండడం విశేషం. అక్కినేని నాగార్జున, నాగవంశీ  కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. స్టార్ హీరోల ఫ్యామిలీ బ్యానర్‌తో పాటు, సితార వంటి అగ్ర నిర్మాణ సంస్థ భాగస్వామ్యం కావడంతో.. ఈ సినిమా స్థాయి అమాంతం పెరిగింది.

స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ..

లేటెస్ట్ గా 'లెనిన్' సినిమా గురించి సినీ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అదేంటంటే... ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ (Item Number) ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ లక్కీ బ్యూటీ మరెవరో కాదు... అనన్య పాండే. బాలీవుడ్‌లో తన గ్లామర్‌తో, డ్యాన్స్‌తో యువతను ఆకర్షిస్తున్న అనన్య పాండే... ఈ స్పెషల్ సాంగ్‌తో పాటు, సినిమాలో ఓ చిన్న అతిథి పాత్రలో  కూడా కనిపించబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో అఖిల్, అనన్యల కాంబినేషన్ తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని పంచుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే, ఈ స్పెషల్ సాంగ్ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

కథా నేపథ్యం.. 

'లెనిన్' సినిమా కథా నేపథ్యం గురించి చెప్పాలంటే... ఇది ప్రధానంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతపు కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. పక్కా లోకల్ ఫ్లేవర్, ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో హైలైట్‌గా ఉండనున్నాయని సమాచారం. అఖిల్ సరసన భాగ్య శ్రీ జోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ భారీ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండడం, సినిమా అంచనాలను రెట్టింపు చేసింది.  త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్, ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.