
బెంగుళూరు: టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టీకేఎం) తన కార్ కేర్ బ్రాండ్, “టీ గ్లోస్” ద్వారా కార్ల డిటైలింగ్ వ్యాపారంలోకి వచ్చింది. ప్రతి టొయోటా డీలర్‌షిప్ వద్ద “టీ గ్లోస్” సేవలను ప్రొఫెషనల్ పద్ధతిలో అందిస్తారు. కార్ల తయారీ పరిశ్రమ లో మొట్టమొదటి సారిగా , "టీ గ్లోస్" బ్రాండ్ క్రింద వాహనం రూపాన్ని లోపల, వెలుపల మెరుగుపరచడానికి క్యూరేటెడ్ సేవలను టీకేఎం అందిస్తుంది.
ఇందులో సిరామిక్ కోటింగ్, అండర్ బాడీ కోటింగ్, సైలెన్సర్ కోటింగ్, ఇంటర్నల్ ప్యానెల్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ వాహనాల సౌందర్యాన్ని, ఆకర్షణను పెంచుతాయి. కస్టమర్‌లు తమ కారుకు కొత్త జీవం పోసే ఇంటీరియర్ ఎన్‌రిచ్‌మెంట్, ఎక్స్‌టీరియర్ బ్యూటిఫికేషన్సేవలను కూడా పొందవచ్చు.