దొడ్డు వడ్లపై సందిగ్ధత ! గతేడాది 10 లక్షల టన్నులపైనే నేటికీ తేల్చని కేంద్రం

 దొడ్డు వడ్లపై సందిగ్ధత ! గతేడాది 10 లక్షల టన్నులపైనే నేటికీ తేల్చని కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం పండించే దొడ్డు వడ్లపై సందిగ్ధత నెలకొంది. గతేడాది యాసంగిలో పండించిన వడ్లలో సీఎంఆర్​లో బాయిల్డ్ రైస్​పై రాష్ట్ర సర్కారు చేసిన అభ్యర్థనపై నేటికీ కేంద్ర ప్రభుత్వం  తేల్చలేదు.  దీనిపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో డైలమాలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు  2024–25 సంవత్సరానికి  యాసంగి సీజన్‌లో 35 లక్షల టన్నుల బియ్యం సేకరణకు  ఎఫ్​సీఐకి కేంద్రం కేటాయించింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్ర సివిల్ సప్లయ్  నుంచి ఎఫ్‌సీఐకి 17.83 లక్షల టన్నులకుపైగా బాయిల్డ్ రైస్, 1.13 లక్షల టన్నులకు పైగా రా రైస్ డెలివరీ అయ్యాయి.  మిగిలిన 1.56 లక్షల టన్నుల బాయిల్డ్, దాదాపు 14.01 లక్షల టన్నుల రా రైస్ డెలివరీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. సాధారణంగా యాసంగి వడ్లు బాయిల్డ్ రైస్‌కు అనువుగా ఉండగా..  పెండింగ్  రా రైస్​కు బదులుగా అదనంగా 10 లక్షల టన్నులు  బాయిల్డ్​ రైస్ ను అనుమతించాలని కేంద్రాన్ని  రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థించారు. కాగా.. ఇది కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పరిశీలనలో ఉంది. 

యాసంగిలో పెరగనున్న దొడ్డు రకాల సాగు
అయితే ఈ సారి యాసంగిలోనూ భారీగా దొడ్డు రకం వరి సాగైతున్నది. యాసంగి సాధారణ వరిసాగు విస్తీర్ణం 51.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 11.59లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి.  ఈ సీజన్ లో వరి మొత్తం విస్తీర్ణం 60 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని రాష్ట్ర  వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఇందులో 70 శాతానికి పైగా దొడ్డు రకాలే  వేసే పరిస్థితి ఉందని  భావిస్తున్నారు. 

దొడ్డు రకాల కొనుగోళ్లపై ఆసక్తి చూపని కేంద్రం
కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌  రైస్‌కు బదులుగా రా రైస్‌ను మాత్రమే సరఫరా చేయాలని కొన్నాళ్లుగా చెప్తున్నది. అలాగే దొడ్డు వడ్ల నుంచి ఉత్పత్తి అయ్యే బాయిల్డ్‌ రైస్‌కు మార్కెట్‌లో డిమాండ్‌ తక్కువగా ఉంటు న్నది. దీంతో మున్ముందు దొడ్డు వడ్ల కొనుగోళ్లపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర ప్రభు త్వం ఏటా బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాల ని కోరుతున్నప్పటికీ, కేంద్రం పెద్దగా ముందుకు రావడం లేదు. కేంద్రం వెనక్కు తగ్గితే మొత్తం బాధ్యత రాష్ట్రంపైనే పడుతుం దని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నా రు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పెరగడమే కాకుండా, రైతులకు మార్కెటింగ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రైతుల భవిష్యత్​కు కీలకంగా మారనున్నాయి.