ఓటు హక్కును తొలగించేందుకే.. బీజేపీ SIR కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

ఓటు హక్కును తొలగించేందుకే.. బీజేపీ SIR కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం:ఓటు హక్కును తొలగించేందుకే SIR తీసుకొచ్చిందన్నారు సీఎం రేవంత్​రెడ్డి. బీజేపీ ప్రజాహక్కులను కాలరాస్తోందన్న సీఎం రేవంత్​ రెడ్డి.. ఓటు హక్కును తొలగిస్తే  మానవ ఉనికికే ప్రమాదమన్నారు.  SIR తో భూమి లేని పేదలకు హక్కులు పోతాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా  కమ్యూనిస్టులు, కాంగ్రెస్​ కలిసి పోరాటం చేయాలన్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్​ వేరు వేరు  కాదు.. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటానికి కామ్రెడ్లు  కూడా కారణమన్నారు. ఖమ్మం  జిల్లాకు ప్రత్యేకత ఉంది..మోదీ, అమిత్​ షా కలిసి వచ్చిన  రెండు సర్పంచ్​ స్థానాలు కూడా గెలవలేరని  సవాల్​ విసిరారు. 

సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో చీఫ్ గెస్ట్​ గా పాల్గొన్న సీఎం రేవంత్​ రెడ్డి.. బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేసింది.. అందుకు ఎలాగైన  400 సీట్లు గెలవాలని భావించింది.. కాంగ్రెస్​ తో కలిసిన ఇండియా కూటమి బీజేపీ సీట్లకు గండి కొట్టిందన్నారు. గోవాల్కర్​ సిద్దాంతాన్ని అమలు చేసి భారతీయ మూల వాసులను దేశం నుంచి తరిమి వేయాలని బీజేపీ చూస్తోందన్నారు సీఎం. 

పేద, కార్మిక వర్గాలకోసం కాంగ్రెస్​, కమ్యూనిస్టులు  కలిసి ఎన్నో పోరాటాల చేశారన్నారు.  కార్మికులకోసం కనీస  వేతన చట్టం తీసుకొచ్చిందేకాంగ్రెస్​ అన్నారు సీఎం రేవంత్​ రెడ్డి. కమ్యూనిస్టుల పోరాటంతోనే హైదరాబాద్​ స్వేచ్ఛావాయువులు పీల్చిందన్నారు సీఎం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  పేదల హక్కులను కాలరాస్తోందన్నారు.ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవాలని చూస్తోందన్నారు.